తెరాస సర్కారుకు గులాం గిరి చేస్తున్న టీఎస్ పోలీసులు.. రేవంత్ రెడ్డి ట్వీట్

శుక్రవారం, 16 జులై 2021 (15:24 IST)
పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ శుక్రవారం ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న కార్యకర్తలను, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడమే కాక అరెస్టులు కూడా చేసింది. అయితే, తమ ఛలో రాజ్‌భవన్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు.. ఆ తర్వాత అడ్డుకోవడం ఏమిటని టి కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ క్రమంలో టీపీసీసీ ప్రెసెడింట్‌ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఇందిరా పార్క్‌ దగ్గర నిరసన తెలపుతున్న వెంకట్‌ బల్మూర్‌ అనే కాంగ్రెస్‌ కార్యకర్తను పోలీసులు రోడ్డు మీద పరిగెత్తించి మరీ అరెస్టు చేశారు. ఒక్క వ్యక్తిని అరెస్ట్‌ చేయడం కోసం దాదాపు ఏడేనిమిది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వెంకట్‌ని బలవంతంగా అక్కడ నుంచి తీసుకెళ్లారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియోని రేవంత్‌ రెడ్డి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. 'పోలీసులు దారుణ ప్రవర్తనకు నిదర్శనం ఈ వీడియో. ముందస్తు అనుమతితో శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గులాం గిరి చేస్తున్నారు' అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు