తెలంగాణ ప్రభుత్వం నుంచి శశికళకు నోటీసులు... నలిపేసిన శశి

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (21:46 IST)
శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించేందుకు బెంగుళూరుకు శశికళ బయలుదేరే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరో నోటీసు వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఒక ఇల్లు ఉండగా, ఆ ఇంటికి గత రెండేళ్ళ నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదు శశికళ. 
 
పన్ను బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని సంకల్పించిన కెసీఆర్ సర్కార్ ఈ మేరకు శశికళ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఇంటిని 1990 ప్రాంతంలో శశికళ కొనుగోలు చేశారట. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొంతకాలం జయలలిత ఇదే ఇంట్లోనే బస చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చినప్పటి నుంచి వారు ఖాళీ చేసి వెళ్ళిన తరువాత గత నాలుగేళ్ళుగా ఈ ఇల్లు ఖాళీగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.
 
శశికళ బెంగుళూరుకు బయలుదేరక ముందే ఆమెకు ఈ నోటీసులు అందాయట. దీంతో ఆమె మరింత ఆవేదన చెందుతూ ఆ నోటీసు నల్లిని నలిపినట్లు నలిపి అక్కడ పడేసి వెళ్లిపోయారట.

వెబ్దునియా పై చదవండి