తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి.. నో డౌట్ : షబ్బీర్ అలీ

బుధవారం, 15 నవంబరు 2023 (12:27 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై చర్చ సాగుతుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అవుతారని చెప్పారు. 
 
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండలం రెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను కామారెడ్డిని వదిలి ఎక్కడికీ పోలేదన్నారు. మీ గుండెల్లోనే ఉన్నాడని చెప్పారు ఇక్కడ నుంచి తనకు బదులు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారన్నారు. 
 
ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కామారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డితో పాటు కొడంగల్‌లో పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు