కిట్టీ పార్టీలు, అధిక వడ్డీల పేరుతో రూ.7 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేసిన శిల్పా చౌదరీకి పోలీస్ కస్టడీ విధించారు. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌తో పాటు పోలీసులు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం వాదనలు ముగిశాయి.
ఈ పిటిషన్లపై వాదనలు ఆలకించిన కోర్టు శిల్పా శెట్టికి బెయిల్ మంజూరు చేయకుండా, పోలీస్ కస్టడీ విధిస్తూ హైదరాబాద్ నగర రాజేంద్ర నగర్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే, ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో శిల్పా చౌదరిని పోలీసులు శనివారం తమ కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారించనున్నారు. ఈ కేసుల్లో శిల్పా చౌదరితో ఆమె భర్త కృష్ణ ప్రసాద్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.