తన ప్రేమ పెళ్లికి ఇంట్లో వారు అంగీకరించడం లేదనే ఆవేదనతో వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన ఎస్ఐ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బందోబస్తుకు విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఎస్ఐ హఠాత్తుగా ఇలా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. కాగా ఎస్ఐ ఆత్మహత్యకు కారణం ప్రేమేనా లేదంటే మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు.
అతడి స్నేహితుడు ఇచ్చిన వివరాల ప్రకారం అది ప్రేమ పెళ్లికి ఒప్పుకోనందువల్లనే జరిగిన ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. శ్రీధర్ స్నేహితుడు సందీప్ అనే హోంగార్డు చెప్పిన విషయాలను చూస్తే... గత రాత్రి కూడా శ్రీధర్ తను చనిపోవాలనుకుంటున్నట్లు తనతో చెప్పాడని వెల్లడించారు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడేందుకు ఇంట్లో అంగీకరించడం లేదనీ, అందువల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడని తెలియజేశాడు. ఐతే తను వారించడంతో నిన్న ఆ పని చేసుకోలేదనీ, ఇంతలో మళ్లీ అతడు ప్రాణాలను తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.