ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.... ఏంటది?

ఆదివారం, 20 మార్చి 2022 (10:39 IST)
వేసవి కాలంలో నెలకొనే రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఈ రద్దీని నివారించేందుకు వీలుగా 104 ప్రత్యేక రైళ్లను నుడుపనున్నట్టు ప్రకటించింది. ఈ రైళ్లు వివిధ ప్రాంతాలకు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు ద.మ రైల్వే అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
వీటిలో సికింద్రాబాద్‌ - ఎర్నాకులం ప్రత్యేక రైలు (నంబరు 07189) ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 24 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి  బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 8.15 గంటలకు ఎర్నాకులం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఎర్నాకులం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (నంబరు 07190) ఏప్రిల్‌ 2 నుంచి జూన్‌ 25 వరకు  ప్రతి శనివారం రాత్రి 11.25 గంటలకు ఎర్నాకులం నుంచి  బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. 
 
అలాగే, మచిలీపట్నం - కర్నూలు సిటీల మధ్య  ప్రత్యేక రైలు (07067) ఏప్రిల్‌లో 2, 5, 7, 9, 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో, మేలో 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో, జూన్‌లో 2, 4, 7, 9, 11, 14, 16, 18, 21, 23,25, 28, 30 తేదీల్లో 15.50 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు 5.10 గంటలకు కర్నూలు చేరుతుందని వివరించారు. 
 
తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ - మచిలీపట్నం ప్రత్యేక రైలు (07068) ఏప్రిల్‌లో 3, 6, 8, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో, మేలో 1, 4, 6, 8, 11, 13,15, 18, 20,22, 25, 27, 29 తేదీల్లో, జూన్‌లో 1, 3, 5, 8, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29, జూలై 1వ తేదీన 20.00 గంటలకు కర్నూలులో బయలుదేరి మరుసటి రోజు 7.15 గంటలకు మచిలీపట్నం చేరుతుందని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు