ఎండలే ఎండలు.. తెలంగాణలో పెరిగిన చిల్డ్ బీర్ అమ్మకాలు

శనివారం, 7 మే 2022 (18:36 IST)
తెలంగాణలో బీర్ల అమ్మకాలు పెరిగిపోయాయి. ఎండలు ఎక్కువవటంతో బీర్లను తాగేస్తున్నారు మద్యం ప్రియులు. ఎండల తీవ్రతల కారణంగానే మద్యం అమ్మకాలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కరెంటు కోతలు లేకపోవటంతో రాష్ట్రంలో చిల్డ్‌ బీర్లు దొరుకుతున్నాయి. దీంతో విస్కీ, బ్రాందీ, ఇతర మద్యం కంటే ఎక్కువ మంది బీర్లు కొనేస్తున్నారు. బీర్లకు భారీగా గిరాకీ ఏర్పడిందని, మద్యం ప్రియులు ఎండాకాలం బీర్లపైనే ఆధారపడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.  అన్ని రకాల మద్యం అమ్మకాలు సేల్‌ వాల్యూపరంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే 19 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.
 
ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి 49,84,285 కేసుల బీర్లు, 27,69,998 కేసుల ఇతర మద్యం సీసాలు అమ్ముడుపోయాయి. 
 
2021-22 లో లిక్కర్ 26,87,808 కేన్లు అమ్ముడయితే, బీర్లు 26,12,694 కేన్లు అమ్మేశారు. 2022-23లో లిక్కర్ 27,69,998 కేన్లు తాగితే బీరు ఏకంగా 43,84,285 కేన్లు తాగేశారు. తెలంగాణల బీర్ల అమ్మకాల్లో 10 జిల్లాల్లో కరీంనగర్ టాప్‌లో నిలిచింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు