సాగర్‌లో గణేష్ నిమజ్జనాలపై రేపు నిర్ణయం

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (12:22 IST)
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగ‌ర్‌లో వినాయ‌క విగ్ర‌హాల నిమ‌జ్జ‌నంపై సుప్రీంకోర్టులో గురువారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది. త్వ‌ర‌గా విచార‌ణ చేప‌ట్టాల‌ని ధ‌ర్మాస‌నం ముందు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌స్తావించింది. 
 
బుధవారం విచార‌ణ‌కు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ధ‌ర్మాస‌నానికి విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో రేపు విచార‌ణ చేప‌ట్టేందుకు కోర్టు అంగీక‌రించింది. ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్ర‌హాల‌ను హుస్సేన్ సాగ‌ర్‌లో నిమ‌జ్జ‌నం చేయ‌కూడ‌దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.
 
మరోవైపు, హుస్సేన్ సాగర్‌లోనే వినాయక నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు వెల్లడించారు. నిమజ్జనానికి ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. 
 
నిమజ్జనం చేసుకోవద్దని హైకోర్టు చెప్పలేదని, కోర్టు తీర్పును అమలు చేస్తారా చేయారా ప్రభుత్వం చేతిలో ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా సాగర్ లో నిమజ్జనం ఏర్పాట్లు చేయాలన్నారు. కోర్టు తీర్పులను కాదని జల్లికట్టు లాంటి పండుగలే నిర్వహిస్తుంటే నిమజ్జనం ఎందుకు చేయొద్దన్నారు.
 
ఇదిలావుంటే, ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రభుత్వానికి ఈసారి సవాల్​గా మారింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సంజీవయ్య పార్కులోని బేబీ పాండ్‌లో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం చేయాలని అధికారులు భావిస్తున్నారు. 
 
అయితే అందుకు ఏర్పాట్లు మాత్రం చేయట్లేదు. బుధవారం సుప్రీంకోర్టు తీర్పు తరువాత అధికారులు నిర్ణయాని రానున్నట్లు తెలిసింది. ట్యాంక్ బండ్ లో నిమజ్జనం వద్దని తీర్పొస్తే బేబీ పాండ్ లోనే ఖైరతాబాద్ గణేశ్​నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు