సీఎం కేసీఆర్ హత్యకు ప్లానా? తప్పిన పెను ప్రమాదం

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (13:58 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హత్యకు ఎవరైనా కుట్రపన్నారా? అనే అంశం ఇపుడు తెరపైకి వచ్చింది. మంగళవారం ఆయన పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆదిలాబాద్ పర్యటనకు ఆయన బయలుదేరిన హెలికాప్టర్‌లోని ఓ వీహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ సెట్‌ ఉన్న బ్యాగు నుంచి ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పొగరావడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. హెలికాప్టర్‌లో సెక్యూరిటీ సిబ్బంది వాడే కమ్యూనికేషన్ సెట్‌లో షార్ట్ సర్క్కూట్ కారణంగా పొగలు వచ్చినట్లు తొలుత భావించారు. 
 
అయితే, ఆ బ్యాగును నిశితంగా పరిశీలించగా, సీఎం కాన్వాయ్‌లోని వైర్‌లెస్ సెట్ నుంచే ఈ మంటలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది బ్యాటరీ ఓవర్ హీట్ కావడంతో అకస్మాత్తుగా పొగలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ గాల్లోకి లేవకముందే బ్యాగ్‌ను బయటపడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
 
ఈ ఘటనపై ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వట్టర్‌లో స్పందించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తాను ఫోన్‌లో సంప్రదించానని, సీఎంకి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన చెప్పారు. సీఎం తన ఆదిలాబాద్ పర్యటనను యధావిధిగా కొనసాగిస్తారని కేటీఆర్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు