తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాలపై వైద్య, ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టీకా వేయించుకోనివారికి రేషన్, పెన్షన్‌ను నిలిపి వేస్తామంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ నిబంధన నవంబరు 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలంగాణ ఆరోగ్య విభాగం డైరెక్టర్ డి.హెచ్. శ్రీనివాస రావు వెల్లడించారు.
ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్, పెన్షన్ కట్ అవుతుందని శ్రీనివాసరావు స్పష్టంచేశారు. కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గలేదని.. దానిని నివారించేందుకు వ్యాక్సినేషన్ ముఖ్యమన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతమవుతుందన్నారు.