తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 3897 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. వచ్చే యేడాది నుంచి ప్రారంభంకానున్న 9 బోధనా ఆస్పత్రుల కోసం ఈ పోస్టులను మంజూరు చేసింది. ఒక్కో బోధనా ఆస్పత్రికి 433 పోస్టుల చొప్పున కేటాయించి భర్తీ చేయనున్నారు. మొత్తంగా 3,897 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
ముఖ్యంగా, వికారాబాద్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ అసిఫాబాద్, జనగాం, నిర్మల్ జిల్లాల్లో కొత్తగా బోధనా ఆస్పత్రులను ప్రారంభించనున్నారు. వీటికి అవసరమైన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ఇతరాత్రా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మజూరు చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం ఓ ట్వీట్ చేశారు.