బీజేపీ వర్సెస్ తెరాస శ్రేణుల రాళ్ళదాడి.. పోలీసుకు గాయం

శనివారం, 19 ఫిబ్రవరి 2022 (18:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు పదేపదే తలపడుతున్నారు. ముఖ్యంగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా తెరాస శ్రేణులు ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.
 
తాజాగా నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో విధుల్లో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ వంశీకృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ధర్పల్లిలో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ అరవింద్ వస్తున్నారని తెలుసుకున్న తెరాస కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకురుని తెరాస కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం, వాదనలు పెద్దవి కావడంతో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. జిల్లాకు పసుపు బోర్డు మంజూరు చేయిస్తానని ఎంపీ అరవింద్, బండి సంజయ్‌లు హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో ఇచ్చిని హామీని నెరవేర్చలేదంటూ తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు