బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ

శనివారం, 19 ఫిబ్రవరి 2022 (16:14 IST)
Boyapati Srinu, Ram, Srinivasa Chittoori, Sravanti Ravi Kishore and others
'భద్ర', 'తులసి', 'సింహ', 'దమ్ము', 'లెజెండ్', 'సరైనోడు', 'జయ జానకి నాయక', 'అఖండ' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన చేసిన 'అఖండ' సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో థియేటర్లకు మళ్ళీ పూర్వ వైభవం రావడంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. బోయపాటి శ్రీను అతి త్వరలో కొత్త సినిమాను పట్టాలు ఎక్కించడానికి రెడీ అయ్యారు. ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా ఆయన సినిమా చేయనున్నారు. ప్రస్తుతం రామ్‌తో 'ది వారియర్'ను నిర్మిస్తున్న ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి, పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ సినిమాను నిర్మించనున్నారు.
 
బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం... ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీనిని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి పవన్ కుమార్ సమర్పకులు. నేడు అధికారికంగా ఈ వివరాలు ప్రకటించారు.
 
ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. అదీ మా హీరో రామ్ తో 'ది వారియర్' తర్వాత సినిమాగా కుదరడం కూడా హ్యాపీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం. మా బ్యాన‌ర్‌కు ఇది ప్రెస్టీజియస్ మూవీ. ప్రస్తుతం రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో 'ది వారియర్'ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. బోయపాటి - రామ్ సినిమా కూడా భారీ స్థాయిలో, ఉన్నత నిర్మాణ విలువలతో తీస్తాం" అని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు