కొమురం భీం జిల్లాలో పెద్దపులి.. ఇప్పటికే ఇద్దరు మృతి

శనివారం, 30 జనవరి 2021 (09:23 IST)
కొమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. దహేగం మండలం రాంపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అటవీ అధికారులు సూచించారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పెద్దపులి పంజాకు ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. 
 
గత నవంబరు 11న దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌ అనే యువకుడిని పులి హతమార్చింది. అదేనెల 29న పెంచికలపేట మండలం కొండపెల్లికి చెందిన నిర్మల అనే బాలికను పొట్టన పెట్టుకుంది.
 
ఈ క్రమంలో రెండు నెలలుగా పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు