ఈ నెల 15న తెలంగాణ టెట్ ప్రవేశ పరీక్ష

సోమవారం, 11 సెప్టెంబరు 2023 (16:44 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష (టెట్) 2023ను ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టెట్ కన్వీనర్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి సంచాలకురాలు రాధారెడ్డి విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి పరీక్షకు 1139 పరీక్షా కేంద్రాలను, రెండో పేపర్ పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కన్వీనర్ తన ప్రకటనలో తెలిపింది. 
 
ఇదిలావుంటే, ఈ పరీక్షలో మొదటి పేపర్‌కు 2,69,557 మంది, రెండో పేపర్‌కు 2,08,498 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు పేపర్లకు కలిపి 1,86,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ యేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 2,91,058 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను ఈ నెల 14వ తేదీ రాత్రి వరకు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 
 
హాల్ టిక్కెట్ల డౌన్‌లోడులో ఏదైనా సమస్య ఎదురైతే హెల్ప్ డెస్క్ 040-23120340 లేదా 040-23120433 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మొదటి పేపర్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి రెండో పేపర్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు