కే౦ద్ర సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా వెంకటేశ్వర్

మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:34 IST)
కే౦ద్ర సమాచార శాఖ (తెల౦గాణ‌) అదనపు డైరెక్టర్ జనరల్ గా 1989 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కు చెందిన ఎస్. వెంకటేశ్వర్ ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా విధులు నిర్వహి౦చిన‌ ఎస్. వెంకటేశ్వర్ డెప్యుటేషన్ అనంతరం బదిలీపై హైదరాబాద్ వచ్చారు. ఎస్. వెంకటేశ్వర్ ‘రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా’ హైదరాబాద్ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ట్రార్ గా కూడా వ్యవహరిస్తారు.

అంతే కాకుండా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో’ కు అధిపతిగా కూడా ఆయన‌ వ్యవహరిస్తారు. ‘క్షేత్ర ప్రచార విభాగం (డి.ఎఫ్.పి), దృశ్య, ప్రకటనల విభాగం(డి.ఏ.వి.పి), గేయ, నాటక విభాగాల’ను కలిపి రీజినల్ అవుట్ రీచ్ బ్యురో గా పిలవబడుతో౦ది. ‘కేంద్ర ప్రభుత్వ ప్రచుర‌ణల విభాగం’(డిపిడి) కూడా అడిషనల్ డైరక్టర్ జనరల్ పరిధిలో పని చేస్తుంది. 
 
ఎస్. వెంకటేశ్వర్ గత౦లో సమాచార- ప్రసార మ౦త్రిత్వ‌ శాఖలోని పలు విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వర్తి౦చారు. తన 30 స౦వత్సరాల సర్వీస్ కాల౦లో పత్రికా సమాచార కార్యాలయ౦, బెంగళూరు అదనపు డైరెక్టర్ జనరల్ గా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లలో డైరెక్టర్ గా, పత్రికా సమాచార కార్యాలయం, భువనేశ్వర్ డైరెక్టర్ గా  వివిధ హోదాల్లో ఎస్. వెంకటేశ్వర్ పని చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు