బీజేపీలో చేరనున్న రాములమ్మ!

ఆదివారం, 6 డిశెంబరు 2020 (11:49 IST)
ప్రముఖ సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీలో చేరనుంది. సోమవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. 
 
అనంతరం పలువురు కేంద్ర పెద్దల్ని కలిసి.. కీలక విషయాలపై చర్చించనున్నారు. బీజేపీ ద్వారానే రాజకీయాల్లో అడుగుపెట్టిన రాములమ్మ సుమారు రెండు దశాబ్ధాల అనంతరం తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు.
 
కాగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జేపీ నడ్డా, అమిత్ షాను కలవనున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాల వివరాలను వారికి వివరించనున్నారు. 
 
అలాగే గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రులు, ప్రకాష్ జావడేకర్, స్మృతి ఇరానీ సహా పలువురు నేతలను బండి సంజయ్ కలసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు