అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని, బయటికి వచ్చే సమయంలో విధిగా మాస్క్ ధరించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాస్కులు ధరించకుండా బయటికి వచ్చే వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, బయటికి వస్తే మాస్క్ విధిగా ధరించాలని, కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్న పోలీస్, వైద్య శాఖ, సానిటరీ సిబ్బందితో ప్రజలంతా సహకరించాలని ఆయన సూచించారు.