కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందినా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ముఖం చూపించలేకనే ఒక్కరోజు ముందు దేవెగౌడ, కుమారస్వామిలను కేసీఆర్ కలిసి వచ్చారని విమర్శించారు కాంగ్రెస్ నేత చెన్నారెడ్డి. కాంగ్రెస్ బలంతోనే కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్న విషయం కేసీఆర్‌కు తెలియదా అని మండిపడ్డారు.
బెంగళూరులో కేసీఆర్ బీజేపీకి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోనియా భిక్ష వల్లే కేసీఆర్ రాష్ట్రానికి సీఎం అయ్యారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎకరాకు 4 వేలు ఇస్తున్నారని, ఇది రైతు బంధు పథకం కాదు.. ఇది ఓట్ల బంధు పథకంలా ఉందన్నారు చెన్నారెడ్డి.