చిత్రం, నువ్వు-నేను, జయం వంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాసిన ప్రముఖ సినీగేయ రచయిత కులశేఖర్ ఇటీవల ఓ దొంగతనం కేసులో పట్టుబడి జైలుపాలయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు మతిస్థిమితం సరిగా లేకపోవడంవల్లే ఈ దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నా ఎవరూ అండగా లేని పరిస్థితి వచ్చింది.
ఇటీవల కులశేఖర్ అక్టోబరు 24న కాకినాడలోని ఓ గుడికి వెళ్లి.. అక్కడ దర్శనానంతరం దేవుడి శఠగోపం ఎత్తుకొచ్చారనే ఆరోపణలపై కులశేఖర్‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై తీర్పు కూడా వచ్చింది. కులశేఖర్‌కి ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించారు. గీత రచయితగా బిజీ అయినప్పుడే.. ఆయన 'ప్రేమలేఖరాశా' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఆ సినిమా చాలాకాలం పాటు విడుదలకు నోచుకోలేదు. అప్పుడే కులశేఖర్ మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఆయన మానసికంగా బాధపడుతున్నట్లు సమాచారం. ఈ దొంగతనం కేసులో ఆయన తరుఫున ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వమే ఓ న్యాయవాధిని నియమించి కేసును విచారించాలని ఆదేశించింది.