అనుష్కతో మార్నింగ్ వాక్ వద్దంటున్న గోపిచంద్‌

విలన్ కమ్ హీరో గోపిచంద్‌కు "అరుంధతి" బొమ్మాళీ గండమని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. లక్ష్యం, శౌర్యం చిత్రాల నుంచి గోపిచంద్‌కి, అనుష్కకు మధ్య ఏదో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే అవన్నీ అసత్యమని ఇద్దరూ విడివిడిగానే ఖండించారు.

తాజాగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయాలని అంటే.. గోపిచంద్ ఆనందంగా ఒప్పేసుకున్నాడట. అయితే వీరిద్దరి కాంబినేషన్ గురించి ఇంట్లో వారు వద్దన్నారట.

అసలు విషయం ఏమిటంటే..? ఆ మధ్య అనుష్క గోపించంద్ ఇంటికి తరచూ వెళుతుండేది. మార్నింగ్ వాకింగ్‌కు కలిసి వెళ్ళేవారట. దీంతో ఇకపై ఎవరినీ ఇంటికి రానివ్వనని గోపిచంద్ తేల్చి చెబుతున్నాడు.

చివరికి ఇంట్లో బాధ తట్టుకోలేక నిర్మాతకు ఫోన్‌చేసి డేట్స్ కుదరలేదు. అనుష్కతో కలిసి సినిమా చేయనని చెప్పాడట. దాంతో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ రవితేజను తీసుకున్నారు.

"డాన్‌శీను" పేరుతో తయారవుతున్న ఈ చిత్రానికి మలినేని గోపి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంకేముంది..? గోపిచంద్‌కు బొమ్మాళీతోనే గండం ఉందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. మరి మీరేమంటారు..?

వెబ్దునియా పై చదవండి