బికినీలు ధరించి పాపులరైన హాటెస్ట్ తార నీతూ చంద్రా. తెలుగులో అడపాదడపా పాత్రలు వచ్చినా హిట్ రాలేదు కానీ ప్రేక్షకులలో హీట్ కల్గించిందన్న ఇమేజ్ మాత్రం వచ్చింది. టాలీవుడ్‌లో తనకు అవకాశాలు మిణుకు మిణుకు అంటుండంతో చివరికి కోలీవుడ్‌కు తన మకాం మార్చేసింది.
తన రూపం గురించి నీతును ప్రశ్నిస్తే... ఖచ్చితంగా చెప్పడం కష్టం అంటోంది. అసలు తన రూపం ఎవరిలా ఉంటుందో పోల్చుకుని చూడాలని చాలాసార్లు చాలామందిని చూసిందట. ఇంటర్నెట్‌లో తనలాంటి పోలికలున్న వ్యక్తులెవరైనా కనబడతారేమోనని తెగ వెతికిందట. కానీ ప్రయోజనం శూన్యమేనని చెపుతోంది. అంటే తనలాంటి వ్యక్తి ఈ భూ ప్రపంచంలో లేరన్నమాట.
అయితే తను ఎక్కడ కనబడినా అబ్బాయిలు మాత్రం కళ్లార్పకుండా గుడ్లప్పగించి అదేపనిగా చూస్తుంటారనీ, తనలో అంతగా ఆకర్షించే అంశాలు ఏమున్నాయని వారు అలా చూస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం ఉంటుందని చెపుతోందట. మరి నీతూ అడిగితే అబ్బాయిలు ఏం చెపుతారో...