హాట్ తార భువనేశ్వరి ఉన్నట్లుండి తన మార్గాన్ని మార్చేసుకుంది. ప్రేక్షలకు పొట్టి దుస్తుల్లో కన్పించి రెచ్చగొట్టే భువన ఒక్కసారిగా ఆధ్యాత్మిక మార్గంవైపు దృష్టి సారించింది. తన ఇంటిని రకరకాల దేవుళ్ల ఫోటోలతో నింపేసింది.
అంతేకాదు.. ఆమె ఇంటి నిండా భక్తి రసాన్ని నూరిపోసే పుస్తకాలు దర్శనమిస్తున్నాయి. ఎందుకిలా.. అని ఎవరైనా అడిగితే, అదో రకమైన నవ్వు నవ్వుతూ, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రశాంతత మరిక్కెడా లభ్యం కాదని చెపుతోందట.
కానీ కోలీవుడ్ ఫిలిమ్ వర్గాలు మాత్రం భువన వ్యవహార శైలిపై మరో రకంగా చెపుతున్నారు. బిగ్ స్క్రీన్ మరియు బుల్లితెరపై భువనేశ్వరికి పెద్దగా అవకాశాలు రావడం లేదనీ, దాంతో తీవ్రమైన ఒత్తిడికి గురై ఆధ్యాత్మిక మార్గంవైపు దృష్టి మరల్చి ప్రశాంత జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తోందంటున్నారు. అంతేగా మరి... ఒత్తిడి విరుగుడుకి ఆధ్యాత్మిక మార్గమే మంచి మందు కదా!!