తెలుగు ప్రేక్షకులకు ఆధునిక మల్లీశ్వరిగా పరిచయమైన కత్రినాకైఫ్ బాలీవుడ్‌లో దుమ్ము రేపుతోంది. తనకంటే ముందుకు దూసుకుపోతున్నట్లు ఎవరైనా కనిపిస్తే... వారి అవకాశాలను ఇట్టే లాగేసుకుంటోంది. దక్షిణాది తారలైన అసిన్, శ్రియ వంటి తారలను ఓ కంటకనిపెడుతూ రేసులో ముందుకు వెళుతోంది.