"దేశముదురు" భామతో జతకట్టనున్న దేవీ శ్రీ ప్రసాద్!?

WD
ప్రముఖ గాయకుడు దేవీశ్రీప్రసాద్ హీరోగా ఛార్మి హీరోయిన్‌గా ఓ కొత్త చిత్రంలో నటించబోతున్నారని వార్తలొస్తే.. వాటిని దేవీ శ్రీ ప్రసాద్ ఖండించాడు. ఆ తర్వాత అదే చిత్రంలో ఓ గెటప్‌లో మాత్రం దేవీశ్రీప్రసాద్ కన్పించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

ఈ విషయాన్ని అటుంచితే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎం.ఎస్. రాజు ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి దేవీశ్రీప్రసాద్‌ను హీరోగా ఎంపికచేసినట్లు తెలిసింది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ తండ్రి సత్యానంద్‌కి ఎం.ఎస్. రాజుకు మంచి అనుబంధముంది.

ప్రముఖ రచయిత అయిన సత్యానంద్.. ఎం.ఎస్. రాజు చిత్రాలకు ఆయనే కథలు ఇచ్చేవారు. దాన్ని పరుచూరి బ్రదర్స్ పాలిష్ చేసేవారు. కాగా, ఎం.ఎస్. రాజు-దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న క్రేజీ మూవీ నవంబరులో ప్రారంభం కానుందని తెలిసింది.

ఇందులో దేశముదురు భామ హన్సిక హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. దర్శకుడు ఎవరైనా ఎం.ఎస్ రాజును వేయందే సినిమా కాదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇంకేముంది.. బొద్దుగుమ్మ.. ఛార్మికి దేవీశ్రీ ప్రసాద్ టాటా చెప్పేసి.. హన్సికతో జతకట్టనున్నాడన్నమాట..!.

వెబ్దునియా పై చదవండి