నమిత-శరత్‌బాబులు సహజీవనం చేస్తున్నారా..?!

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో ఇట్టే ఆకట్టుకున్న బొద్దందాల ముద్దుగుమ్మ నమిత గురించి తెలియని వారంటూ ఉండరు. గ్లామర్ ఫీల్డ్‌లో బ్యూటీ క్వీన్‌గా తన హవాను కొనసాగిస్తున్న ఈమె గత కొంత కాలంగా ప్రముఖ నటుడు శరత్‌బాబుతో సహజీవనం కొనసాగిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

గతంలో దశావతారం హీరో కమల్ హాసన్-గౌతమి, పవన్ కళ్యాణ్- రేణు దేశ్యాయ్, సిద్ధార్థ్-సోహా, నయనతార- ప్రభుదేవాల తరహాలోనే నమిత-శరత్‌బాబులు రహస్యంగా సహజీవనం గడుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ విషయమై నమితను కదిలిస్తే.. శరత్‌బాబుతో తనకెలాంటి సంబంధం లేదని దాటవేసింది. అంతేకాదు.. ఆయన తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. ఇంకా శరత్‌బాబు మంచి మనసున్న మనిషి అని, మానవతావాది అని ప్రశంసలతో ముంచెత్తింది.

ఇలా శరత్‌బాబును గురించి కితాబివ్వడం విన్న సినీ పండితులు నమిత-శరత్ బాబుల మధ్య ప్రేమాయణం నడుస్తోందని అనుకుంటున్నారు. మరి వీరి సహజీవనం ఎంతవరకు వస్తుందో వేచి చూడాల్సిందే..!

వెబ్దునియా పై చదవండి