నయన... మన ప్రేమయాణమే తెరకెక్కిస్తున్నా.. నాతో నటిస్తావా..?!!
గురువారం, 5 జులై 2012 (15:20 IST)
నయనతారతో విడదీయలేనంత స్థాయిలో ప్రేమయణాన్ని నడిపి ఆనక విడిపోయిన శింబు తాజాగా నయనతో తాను నడిపిన ప్రేమాయణాన్నే తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ ఫిలిమ్ జనం చెపుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని అంటున్నారు.
గతంలో మన్మథ చిత్రంలో తన టీనేజ్ అనుభవాలను తెరకెక్కించిన శింబు, ఇప్పుడు నయనతో తాను సాగించిన లవ్వాటను "మన్మథ 2" సినిమాలో చూపించబోతున్నట్లు భోగట్టా. ఈ చిత్రంలో నయనతారతో సాగించిన రొమాన్స్ ను డీప్ గా చూపిస్తాడని అంటున్నారు.
ఈ సినిమాలో తన సరసన ఆరుగురు హీరోయిన్లను నటింపజేయనున్నారు. తమన్నా, అనుష్క, ఇలియానా, త్రిష ఇప్పటివరకూ ఫైనల్ అయ్యారు. మిగిలిన రెండు పాత్రల కోసం వెతుకుతున్నట్లు చెపుతున్నారు. రొమాన్స్ 100 పర్సెంట్ పర్ఫెక్ట్‌గా రావాలంటే ప్రధానపాత్రలో నయనతార నటిస్తే బావుంటుందని శింబుకు ఎవరో సలహా ఇచ్చారట. దీంతో నయనతారను ఆ పాత్రలో నటింపజేయాలని ప్రయత్నిస్తున్నాడట శింబు. సినిమావాళ్లు ఏదైనా చేస్తారు... వాళ్ల టాలెంట్ అంత.