మిస్ ఆంధ్రగా టైటిల్‌ను సొంతం చేసుకున్న నటి పూనమ్‌కౌర్. తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్‌కు అంతగా గుర్తింపు రాలేదు.
హ్యాపీడేస్ ఫేమ్ కృష్ణుడు హీరోగా నటించిన "వినాయకుడు" చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్‌గా కూడా నటించింది. అయితే బ్రేక్ రాలేదు.
అయితే పూనమ్‌కౌర్‌కు ఇటీవలే ఓ టీవీషోకు యాంకర్‌గా వ్యవహరించే ఛాన్స్ దొరికింది. అయితే తెలుగు సరిగ్గా మాట్లాడటం రాకపోవడంతో అదికాస్తా చేజారిపోయిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.
కానీ మంచి ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్‌లోనూ అవకాశాల కోసం వేచి చూస్తోంది. మరి పూనమ్‌కౌర్ అనుకున్న అవకాశాలు రావాలని ఆశిద్దామా..!.