"యువరాజు"తో జతకట్టనున్న సానియా మీర్జా!

WD
భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆటతోనే కాకుండా గ్లామర్‌తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించింది. గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటోన్న సానియా మీర్జాపై టాలీవుడ్ నిర్మాతలు కన్నేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

అంతేగాకుండా.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సానియా మీర్జా నటిస్తుందని "శివాజీ" షూటింగ్ సమయంలోనే వార్తలు షికార్లు చేశాయి. కానీ సానియా మీర్జా ఆడపాదడపా ప్రకటనలకే పరిమితం అయ్యింది.

ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబుతో సానియా నటిస్తోంది. కానీ.. ఇదేదో సినిమా అనుకుంటే మాత్రం పప్పులో కాలిసినట్టే..!. ఓ ఎయిర్‌సెల్ కంపెనీకి తమిళంలో సూర్య. జాతీయ స్థాయిలో ధోనీ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.
WD


ప్రస్తుతం ఆ అవకాశం తెలుగులో మహేష్ బాబుకు, సానియాకు లభించిందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. మరి ఈ జంట ఈ ప్రకటన ద్వారా ప్రేక్షకులను, అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే..!

వెబ్దునియా పై చదవండి