సైఫ్- కరీనా లండన్ నగరంలో వారం రోజులు

IFM
సైఫ్ అలీ ఖాన్, సెక్సీతార కరీనాకపూర్ ఓ వారంరోజులపాటు లండన్, న్యూయార్క్ నగరాల్లో గడిపారు. ఎందుకలా...? అని ఎవరైనా అడిగితే తమ తదుపరి చిత్రం ప్రమోషన్లో భాగంగానే తాము వారంరోజుల పాటు ఇక్కడకు వచ్చినట్లు చెపుతున్నారట.

అయితే అది నిజం కాదనీ, సైఫ్- బిబోలిద్దరికీ ఏకాంత ప్రదేశం దొరకక ముంబయి నుంచి కొన్నాళ్లు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లారని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. అయితే ముంబయిలో కూడా వారికంటూ ప్రత్యేకమైన బంగళాను ఏర్పాటు చేసుకున్నట్లు భోగట్టా.

లండన్, న్యూయార్క్ నగరాల నుంచి తిరిగి వచ్చాక మరో నెలరోజులపాటు కాల్షీట్లు ఎవరికీ ఇవ్వనని చెపుతోందట కరీనాకపూర్. ఎందుకలా...?

వెబ్దునియా పై చదవండి