హిట్‌లేని "లవర్‌ బాయ్" సినిమాకు ముగ్గురు దర్శకులు..!

WD
ఒకప్పుడు "లవర్‌ బాయ్‌"గా పేరుతెచ్చుకున్న తరుణ్‌, ఇప్పుడు హిట్‌ సినిమాలు లేకుండా కష్టాలు పడుతున్నాడు. ఇటీవలే పబ్‌ను నెలకొల్పి సినిమాలు లేనప్పుడు ఆ వ్యాపారాన్ని కూడా చూసుకుంటున్నాడు. విశేషమేమిటంటే..? తాజాగా సుప్రీం ఆడియో కంపెనీ అధినేత రాజు హిర్యాణి తరుణ్‌తో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు.

ప్రారంభంలోనే ఈ చిత్రానికి ఆదిత్య దర్శకుడు. ఆదిత్య ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటంతో.. కాస్త గ్యాప్ ఇచ్చి వి.ఎన్. ఆదిత్యను ఎంపికచేశారు. కొద్దిరోజులు బ్యాంకాక్‌‌లో షూటింగ్ జరిపారు. అక్కడ దర్శకుడికి, నిర్మాతలకు మధ్య గొడవ జరగడంతో ఫైన్ కట్టి వెనుదిరిగి వచ్చారు.

నిర్మాత, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలిద్దరూ అక్కడి డ్యాన్సర్లతో ఎంజాయ్ చేయడం, షూటింగ్‌కు అంతరాయం కలగడంతో దర్శకుడు అవాక్కయ్యాడు. దాంతో దర్శకత్వం సరిగ్గా చేయడం లేదని ఆయనచేత నిర్మాతల మండలికి స్వచ్ఛంధంగా తప్పుకుంటున్నట్లు లెటర్ రాయించారు.

తర్వాత ఇదే చిత్రానికి కన్మణిని మూడో దర్శకుడిగా పెట్టుకున్నారు. మొత్తానికి ముగ్గురు దర్శకులు కలిస్తేగాని తరుణ్ సినిమా ఇంకా పూర్తికావడం లేదు. మరి రిలీజ్ తర్వాత ఏమవుతుందో..? వేచి చూడాల్సిందే..!.

వెబ్దునియా పై చదవండి