Gamchanger previous poster
సినిమారంగంలో షూటింగ్ కూ రిలీజ్ కూ ముహూర్తాలు పెట్టడం పరిపాటే. ఇందుకు చాలా కసరత్తు చేస్తుంటారు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ గురించి టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. సినిమా ప్రారంభంలో చిత్ర టీమ్ అంతా సూట్ బూట్ తో విడుదల చేసిన పోస్టర్ బాగా అట్రాక్ట్ చేసింది. కానీ విడుదల తర్వాత మొత్తం సీన్ మారిపోయినట్లుగా వుంది. దీన్ని బట్టి చూస్తే ముందు అనుకున్న కథను మధ్యలో మార్చేశారా? అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక సోషల్ మీడియాలో పలు వార్తలు వ్యాపిస్తున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని బూతద్ధంతో చూసేలా కొంతమంది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ గురించి చర్చపెట్టారు. ఇందుకు జనవరి 10 రిలీజ్ డేట్ నాడు విడుదల చేయడం సినిమా రంగానికి కలిసిరాలేదని చెబుతున్నారు.