ముఖ్యంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కామెంట్స్ చేయడం చాలా బాధగా ఉందన్నారు. సినిమా రంగంలో ఉండటం ఒక నేరంగా, రాజకీయాల్లో ఉండటం మరో నేరంగా భావిస్తూ, ఈ రెండింటిని ఒకదానితో ఒకటి ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజా జీవితంలో ఉన్న తమ క్యారెక్టర్ల గురించి వ్యాఖ్యలు చేయడాన్ని తమ హక్కుగా భావిస్తారని ఇలా ట్రోల్ చేసే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'ఇలా ఎందుకు రాస్తారు?' అని తిరిగి పోస్ట్ కనుక పెడితే, 'మీకు మీరు సెలెబ్రిటీస్ అని, లీడర్స్ అని ఫీలవుతున్నారా?' అంటూ చెప్పలేని పదాలను వాడుతూ పోస్ట్‌లు చేస్తున్నారని అన్నారు.