గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'గబ్బర్ సింగ్'. ఇందులో శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, కాంబినేషన్ మరోమారు రిపీట్ కానుంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాల్లో నటించాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, "పింక్" రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మరో నాలుగైదు చిత్రాల్లో నటించేందుకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం.