ఉత్తరాది రాష్ట్రాల్లో కర్వాచౌత్ వేడుకను భర్త దీర్ఘాయుష్షును కోరుతూ వివాహిత మహిళలు జరుపుకుంటారు. పార్వతీదేవిని పూజించి రోజంతా ఉపవాసం వుండి ఈ వేడుకను నిర్వహిస్తారు. చంద్రుడిని జల్లెడలో చూసి.. ఆపై భర్తముఖాన్ని చూడటం ద్వారా ఈ వేడుకలు పూర్తవుతాయి. కానీ పెళ్లి కాని వారు కాబోయేభర్తతో ఈ పూజలు చేసుకోవచ్చు.