ఐశ్వర్యరాయ్ వివాహం తర్వాత మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించింది. "జజ్బా", "సరబ్జీత్" చిత్రాల్లో నటించింది. అయితే ఈ రెండు చిత్రాల్లో రొమాన్స్‌కు అసలు అవకాశమే లేదు. ఐశ్వర్యని తమ కలల రాణిగా ఊహించుకునే అభిమానులకు ఆ రెండు సినిమాలు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఐశ్వర్యరాయ్ అభిమానులకు నచ్చే విధంగా కనిపించబోతోంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ తనకంటే పదేళ్లు చిన్నవాడైన రణబీర్ కపూర్‌తో రొమాన్స్ చేస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను యూనిట్ సభ్యులు ఇటీవల రిలీజ్ చేసారు. టీజర్ ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా టీజర్లో చూపించిన రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో మాజీ సుందరితో పాటు అనుష్క శర్మ కూడా నటిస్తున్నప్పటికీ ఆమెను డామినేట్ చేసే విధంగా ఐశ్వర్యరాయ్ అందం ఉందని సినీవర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో అనుష్క-ఐశ్వర్యలు పోటీపడి నటించారు. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్య రాయ్ రెచ్చిపోయింది. ఈ సినిమాతో మళ్ళీ ఐశ్వర్యరాయ్ వరుస సినిమాలతో బిజీ అవ్వడం ఖాయమని సినీజనాలు అభిప్రాయపడుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 28న విడుదల చేయనున్నారు.