యువరాజ్‌తో డేటింగ్... డిజైనర్‌ అర్జున్ ఖన్నాతో ఇల్లీగల్ అఫైర్ ఉంది : నటి కిమ్ శర్మ

శనివారం, 21 జనవరి 2017 (10:54 IST)
బాలీవుడ్ హాట్ నటీమణుల్లో కిమ్ శర్మ ఒకరు. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ మాజీ ప్రేయసి. అలాగే, డిజైనర్ అర్జున్ ఖన్నాతో సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై కిమ్ శర్మ స్పందించింది. యువరాజ్ సింగ్‌తో డేటింగ్ చేసినట్టు అంగీకరించింది. అలాగే, డిజైనర్‌ అర్జున్‌ ఖన్నాతో కిమ్ ఇల్లీగల్‌ అఫైర్‌ పెట్టుకుందని స్పాట్‌ బాయ్‌ వెబ్‌సైట్ వెల్లడించింది.
 
నిజానికి గతంలో యువరాజ్ సింగ్‌తో కలసి డేటింగ్ చేసింది కిమ్... ఆ తర్వాత కెన్యాకి చెందిన వ్యాపారవేత్త అలీ పుంజానిని పెళ్లి చేసుకొంది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకి దూరమైంది. అయితే, ఇప్పుడు భర్త అలీ పుంజానితో విడిపోక ముందే బాలీవుడ్ డిజైనర్‌ అర్జున్‌ ఖన్నాతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం హాట్ టాపిక్ అయ్యింది.
 
కాగా, కృష్ణ వంశీ 'ఖడ్గం'తో టాలీవుడ్ ప్రేక్షకులకి కిమ్ శర్మ సుపరిచితురాలు. బాలీవుడ్‌లో 'మొహబ్బతేన్‌'లాంటి చిత్రాలతో పాపులర్‌ అయింది. అయితే, ఇప్పుడీమె అక్రమ సంబంధం గురించి బాలీవుడ్ జనాలు రకరకాలుగా మాట్లాడుకొంటున్నారు. ఇంతవరకు కూడా స్వాట్ బాయ్ కథనంపై, ఈ ప్రచారంపై నోరు తెరవలేదు కిమ్. దీంతో.. ఆమె అక్రమ సంబంధం మేటరు నిజమేనని భావిస్తున్నారు జనాలు. 

వెబ్దునియా పై చదవండి