ఖైదీ నెంబర్ 150 సినిమాకు హీరోయిన్లు దొరకక నానా తంటాలు పడిన మెగాస్టార్ చిరంజీవి.. తన 151వ సినిమా కోసం అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్‌ని ఖరారు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. తన స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన రోబో 1లో నటించిన ఐశ్వర్యను.. తన 151 చిత్రంలో నటింపజేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో చిరంజీవి సరసన ఐష్ నటించనుందని టాక్ వస్తోంది. కానీ దీనిపై సినీ యూనిట్‌ను ఎలాంటి స్పందన లేదు. ఐష్ కనుక చిరంజీవి సరసన నటిస్తే తెలుగులో ఫుల్ లెంగ్త్ సినిమా ఇదే అవుతుంది. ఈ చిత్రానికి చిరు తనయుడు చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.