తన సహజమైన నటనతో పాపులర్ అయిన సాయి పల్లవి పుష్ప-2లో భాగం కానుంది. పుష్ప 2: ది రూల్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ లేడీ రష్మిక మందన్న నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప-2లో సాయి పల్లవి నటిస్తుందని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ హైదరాబాద్‌లో అల్లు అర్జున్, సాయి పల్లవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. పుష్ప ది రూల్ 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి సీక్వెల్. పుష్ప పార్ట్ వన్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.