చెర్రీ - జూనియర్ ఇద్దరూ కావాలి... అనుపమ పరమేశ్వరన్

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (17:30 IST)
శతమానం భవతి సినిమా హిట్ తరువాత వరుస సినిమా అవకాశాలతో బిజీ అయిపోయింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అ,ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఆ తరువాత ప్రేమమ్ సినిమాలో నటించిన అనుపమ, చివరకు శతమానం భవతి సినిమాతో మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. హైట్ తక్కువ ఉన్నా తన హావభావాలతో అందరినీ ఆకట్టుకున్న అనుపమ ప్రస్తుతం ఇద్దరు యువ హీరోలతో నటించడానికి సిద్ధంగా ఉంది. 
 
సుకుమార్, రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌కు అవకాశం వచ్చింది. అలాగే జూనియర్ ఎన్‌టిఆర్, బాబీలు తీయబోతున్న సినిమాలో కూడా అనుపమకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. దీంతోపాటు మరో రెండు సినిమాలకు అవకాశాలు వచ్చాయి. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ హీరోయిన్ అప్పుడప్పుడు పది నిమిషాల గ్యాప్ దొరికితే ట్విట్టర్‌లో తన అందాన్ని ట్వీట్లు చేస్తూ సంతోష పడుతోందట. తన సినిమాలను ఆదరిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు చెబుతోందట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు