తెరపై తన గ్లామర్‌ను ప్రదర్శించడం ద్వారా అయేషా యువ ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పటికే అయేషా గ్లామరస్ ఫోటోలు, ఆకర్షణీయమైన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి. దీనికి తోడు వెండితెర తెరంగేట్రం ఆమెకు మంచి పేరును సంపాదించిపెడతాయని సినీ పండితులు అంటున్నారు.