బిగ్ బాస్ 1 సీజన్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఫస్ట్ సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా అదరగొట్టాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 సక్సస్‌ఫుల్‌గా కంప్లీట్ కానుంది. ఈ షోకి నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 క్లైమాక్స్‌కు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ షో ముగిసిపోనుంది. దీంతో బిగ్ బాస్ 2 విన్నర్‌గా ఎవరు నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఈ షోలో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లలో విన్నర్ ఎవరో తెలియక బిగ్ బాస్ ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. ఇక ఇదిలాఉంటే ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఎవరు రానున్నారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. అవును.. విషయం ఏంటంటే.. టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచురల్ స్టార్ నాని కలిసి దేవదాస్ అనే సినిమా చేసారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం, అలాగే నాగార్జునకు మా టీవీతో ఉన్న అనుబంధంతో బిగ్ బాస్ 2 ఫైనల్ ఎపిసోడ్‌కి నాగార్జున గెస్ట్‌గా రానున్నారని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్‌గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫైనల్ ఎపిసోడ్‌కి గెస్ట్ వచ్చేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ 2 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ నాగ్ లేక తారక్ లేక చిరంజీవి వీరిలో ఎవరో ఒకరు రావడం మాత్రం ఖాయం అంటున్నారు. వీళ్లు కాకుండా బిగ్ బాస్ ఇంకెవర్నయినా పిసుస్తారేమో.... ఏమో ఏదయినా జరగొచ్చు.