బిగ్ బాస్ సీజన్ 2 సోమవారం విజయవంతంగా వందో ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కౌశల్, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురి, దీప్తి నల్లమోతులతో ఎంతో ఉత్కంఠగా కొనసాగుతోంది. సోమవారం ఎపిసోడ్ మొదటి నుండే కౌషల్ మరియు మిగిలిన సభ్యుల మధ్య వాగ్వివాదం జరుగుతూ వచ్చింది. తనీష్ ప్రాసెస్ ఆఫ్ విన్నింగ్‌ను మీరెలా చూస్తారని కౌశల్‌ని అడగగా దానికి తను పెరిగిన విధానం వలనే గేమ్‌పై ఇంతగా ఫోకస్ చేస్తున్నానని, బయటైతే వేరేలా ఉంటానని, ఇక హౌస్‌లో బంధాలను ఏర్పరుచుకుంటే గేమ్‌పై పట్టు ఉండదని, కనుక నా బంధం కేవలం బిగ్ బాస్, ఇంకా ఆడియెన్స్‌తో మాత్రమే అని స్పష్టం చేసారు.
ఇంతలో తనీష్ మీకు బంధాల మీద అసలు రెస్పెక్ట్ ఉందా అని అడగడంతో వంద శాతం ఉంది అని బదులిచ్చారు కౌషల్. అలాంటప్పుడు హౌస్‌మేట్స్ బంధాలకు ఎందుకు విలువివ్వరు అని అడుగుతుండగా ఈ చర్చనంతా గీతా మాధురి రోల్, సామ్రాట్‌లకు వివరిస్తూ రోల్ రైడా చెవిలో ఏదో గుసగుసలాడింది. ఇంతలో బిగ్ బాస్ హెచ్చరించడంతో ఆ పదం బయటకు చెప్పేది కాదని, అందుకే చెవిలో చెప్పానని సర్దిచెప్పింది. వెంటనే ఎప్పట్లాగే కౌషల్ కలుగజేసుకుని గేమ్ రూల్స్ ప్రకారం గుసగుసలాడటం విరుద్ధం అని చెప్పగా ఇలాంటివాటన్నింటికీ ఈయన రెడీగా ఉంటారన్నారు.
నిన్నటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కి ఒక గేమ్ ఇచ్చారు. ఈ గేమ్‌లో భాగంగా రిపోర్టర్, ఫోటోగ్రాఫర్‌లు బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతున్న స్టోరీలను కవర్ చేయాలి, అపై వాటిని తరువాత ప్లే చేసి చూపిస్తారు, అప్పుడు స్టోరీకి సంబంధించిన వివరాలు తెలియజేయాలి.