దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరు తమన్నా. పాలబుగ్గల తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. కాగా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ''అభినేత్రి'' చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతుంది. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ లేడీ ఓరియంటడ్ సినిమాను ప్రభుదేవా, కోన వెంకట్ నిర్మిస్తున్నారు. దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మూడు భాషల్లో చిత్రీకరించబడుతుంది.