అయితే తన కుమారుడు తీసిన సినిమా ఫెయిల్ కావడం చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదు. అంతేకాదు సినిమాను ఎవరైతే కొన్నారో బయ్యర్లు వారికి డబ్బులు తిరిగి ఇచ్చేవాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారట. మొత్తం రూ.30 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలని చిరంజీవి నిర్ణయానికి వచ్చారట. రామ్ చరణ్ రూ.5 కోట్లు, నిర్మాత దానయ్య రూ. 10 కోట్లు, మరో రూ. 5 కోట్లు దర్శకుడు బోయపాటి శ్రీను ఇవ్వాలని చిరంజీవి చెప్పారట.
అయితే బోయపాటి శ్రీను మాత్రం తాను డబ్బులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడట. తను చిత్రీకరించిన కొన్ని సీన్లపై సినిమాలోని యూనిట్ సభ్యులు, అందులోను నిర్మాత దానయ్య తప్పుడు ప్రచారం చేశాడని, అది తనకు బాగా బాధ కలిగిందని తన స్నేహితులతో వాపోయాడట. దీంతో చిరంజీవి రంగంలోకి దిగి బోయపాటి శ్రీనుకు నచ్చజెప్పేందుకు దిల్ రాజును పంపారట.