మాస్ రాజా రవితేజ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరోగా ఉన్నారు. అయితే... ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్స్ రావడంతో కెరీర్లో కాస్త వెనకబడ్డాడు. అయితే... వరుస ఫ్లాప్స్ వస్తున్నా రవితేజతో సినిమా చేయడానికి మాత్రం దర్శకనిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. త్వరలో విడుదల కానున్న క్రాక్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ కోసం రవితేజ షూటింగ్ చేస్తున్నారు.
క్రాక్ మూవీ పూర్తి చేసిన వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయున్నాడు. ఈ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత మల్టీస్టారర్ మూవీ అయిన అయ్యప్పనమ్ కోషియం రీమేక్‌లో నటించనున్నారు. రవితేజ, వక్కంతం వంశీతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే మరో యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు కూడా ఓ చెప్పాడట మాస్ మహారాజా.
రవితేజ సినిమాలకు నాన్-థియేట్రికల్ హక్కులు రూపంలో మంచి రేటు వస్తుంది. రవితేజ వరుస అపజయాల తర్వాత కూడా తన పారితోషికాన్ని తగ్గించలేదు. ఏది ఏమైనా... ఐదు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను వరుసలో ఉంచిన ఏకైక టాలీవుడ్ హీరో రవితేజ. కరోనా మహమ్మారి ముగిసిన వెంటనే రవితేజ విరామం లేకుండా వర్క్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.