దీనిపై లావన్య సోషల్ మీడియా క్లారిటీ ఇచ్చి ఇవ్వనట్లుగా ఇవ్వడంతో వార్తలో నిజమేననిపిస్తుంది. అదెలా గంటే, సంక్రాంతికి సొంతూరు డ్రెహాడూన్‌కి వెళ్లానని, కుటుంబంతో హాయిగా గడుపుతున్నా అని ఆమె కొన్ని ఫొటోలు పోస్ట్ చేసి సమాధానమిచ్చారు. వరుణ్‌తేజ్ గతంలో పోస్ట్ చేసిని కొన్ని ఫొటోలే ఈ గాసిప్‌లకు కారణమైంది. వీరిద్దరూ రెండు చిత్రాల్లోనూ నటించారు. అదీకాకుండా ఆ సమయంలోనే వరుణ్‌తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లిలో కూడా లావణ్యా సందడి చేసింది. దీంతో వార్తకు బలం చేకూరింది.
ఇదిలా వుండగా, వరుణ్‌తేజ్ పుట్టినరోజు బుధవారం. ఈ సందర్భంగా బెంగుళూరు వెళ్లారు. లావణ్యతో బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే వరుణ్ బెంగుళూరు వెళ్లారనీ, లావణ్యా కోసం ఖరీదైన డైమండ్ రింగ్ కొన్నారనీ వార్త గుప్పు మంది. దీని తెలిసిన లావణ్య స్పందన ఎలా వుందంటే, నేను డెహ్రాడూన్‌లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నా. మా ఊరి అందాలను ఆస్వాదిస్తున్నా అని ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేసింది. కానీ ఎక్కడా ఈ వార్తలో నిజంలేదని చెప్పకపోవడం విశేషం.