'రుద్రమదేవి'కి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు!! ఎక్కడ?

సోమవారం, 31 ఆగస్టు 2020 (11:37 IST)
టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రుద్రమదేవి. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రధారి. రాణి రుద్రమదేవి జీవితకథను ఆధారంగా చేసుకుని హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కించారు. గత 2015లో విడుదలైన ఈ చిత్రం... బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. 
 
అయితే, ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అంతంతమాత్రమేకానీ, ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. రుద్ర‌మ‌దేవి హిందీ అనువాద వెర్ష‌న్‌కు అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. దీనికి నిదర్శనమే రుద్ర‌మ‌దేవి హిందీ వెర్ష‌న్‌కు యూట్యూబ్‌లో 150 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. 
 
ఈ చిత్రంలో గోన గ‌న్నారెడ్డిగా అల్లు అర్జున్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటే, చాలుక్య వీర‌భ‌ద్రుడిగా రానా న‌ట‌నకు మంచి మార్కులు ప‌డ్డాయ‌నే చెప్పాలి. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో రుద్ర‌మ‌దేవి చిత్రం విడుద‌లైంది. 
 
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/7uOBVpZA6I0" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు