ఎంటర్‌టైన్‌ మూవీగా అల్లరి నరేష్ ''ఇంట్లో దెయ్యం.. నాకేం భయం''

మంగళవారం, 4 అక్టోబరు 2016 (10:32 IST)
అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ''ఇంట్లో దెయ్యం.. నాకేం భయం''. ఈ సినిమాకు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో  ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. 
 
అల్లరి నరేష్‌, కృతిక, రాజేంద్రప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్‌లతోపాటు మరో 20 మంది ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. దెయ్యం కామెడీ సినిమాల హవా నడుస్తున్న నేపథ్యంలో అల్లరి నరేష్ కూడా అదే ట్రాక్ ఎక్కేశాడు. ఆల్రెడీ వీళ్లిద్దరి కాంబినేషన్‌లో హిట్ సినిమా ఉండడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చే అవకాశాలున్నాయి. 
 
తొలిసారి ఈ సినిమాలో సన్నాయిమేళంలో, సన్నాయి వాయిద్య కారుడిగా కనిపించబోతున్నాడు. అయితే ఇది కేవలం సినిమాలో హీరో ప్రొఫెషన్ కోసమే. ఇధ్దరు హీరోయిన్లు వున్న ఈ సినిమా కోసం కాస్త గట్టి జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. పక్కా ఎంటర్‌టైన్ మెంట్ సినిమాగా రూపొందున్నఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

వెబ్దునియా పై చదవండి