జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో అర్జున్ కపూర్ ఎఫైర్...

శనివారం, 14 మే 2016 (15:39 IST)
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ ఎక్కువ ఎఫైర్స్‌తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తను చేసిన కొన్నిసినిమాలే అయినా తనతో కలిసి నటించిన ప్రతి అమ్మాయితో ఎఫైర్స్ నడిపిన ఘనత అర్జున్ కపూర్‌కే దక్కుతుంది. జూనియర్ హీరోయిన్ ఆలియా దగ్గర నుంచి సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ వరకు అందరితోను ఆఫ్ స్క్రీన్‌లో రొమాన్స్ చేశాడు. 
 
ఇప్పుడు ఈ జాబితాలో సల్మాన్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా చేరిపోయింది. వీరిద్దరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ అనంతరం ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని నేరుగా పబ్‌లకు పార్టీలకు వెళ్లిపోతున్నారంట. 
 
ఇకపోతే అర్జున్ కపూర్‌తో సినిమా అంటే హీరోయిన్స్ అందరూ ఎగిరిగంతేస్తారని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయం గురించి అర్జున్‌ని సంప్రదిస్తే మాత్రం ఏ హీరోయిన్‌తో ఎఫైర్ అయినా అది ఆ సినిమా వరకు మాత్రమే అంటున్నాడట.

వెబ్దునియా పై చదవండి